జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. దీంతో నిరసన విరమించాలని ఎస్పీ అశోక్ కుమార్ జీవన్ రెడ్డిని కోరారు. దీంతో.. మమ్మల్ని వదిలేయండి.. మాకు (కాంగ్రెస్ కార్యకర్తలకు) జగిత్యాలకు రక్షణ లేదు అంటూ ఎస్పీకి జీవన్ రెడ్డి దండం పెట్టారు. ఈ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ పాలన నడుస్తుందా, కాంగ్రెస్ పాలన సాగుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు రక్షణ లేదన్నారు. అయితే ఈ హత్యకు గ్రామంలోని రాజకీయ పార్టీలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.