ఇదేనిజం, వెబ్‌డెస్క్ : రాజ్యాంగ పదవుల్లో కొనసాగేందుకు సరికొత్త అర్హత పురుడు పోసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సివిల్, క్రిమినల్ నేరారోపణలు ఉన్న వ్యక్తులు రాజ్యాంగ పదవులకు ఎంపికవుతున్నారు. కొన్ని కేసుల్లో దోషిగా తేలినా మళ్లీ ప్రజలు నమ్ముతున్నారు. వాళ్లనే ఫాలో అవుతున్నారు. జై కొడుతున్నారు. జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తికి గౌరవ మర్యాదలు తగ్గేది పోయి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ చిన్న నాయకుడైనా తన రాజకీయ జీవితంలో ఎదగాలంటే జైలుకు పోతే బెటరేమో అనేలా పరిస్థితులు తయారయ్యాయి.
గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైలుపాలయ్యారు. విడుదలైన తర్వాత పాదయాత్ర చేసి జనంలో పేరు సంపాదించుకున్నాడు. డేంజర్ గన్‌లా ఉండే వ్యక్తికి సింపతీతో అధికారం ఇచ్చారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం డబ్బులు పంచే క్రతువులో రేవంత్ అడ్డంగా బుక్కయ్యాడు. ఓటుకు నోటుకు కేసులో రేవంత్ రెడ్డి కటకటాలపాలయ్యారు. కూతురు పెళ్లికి కూడా అందుబాటులో లేక పర్మిషన్ తీసుకొని రావాల్సిన దుస్థితి దాపురించింది. కక్ష, పగ, ప్రతీకారం పెరిగి బరితెగించేందుకు జైలుజీవితం ఉపయోగపడిందేమో! రెట్టించిన ఉత్సాహంతో పోరాడి సీఎం అయ్యాడు. ఏపీలో మరోమంత్రి బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా బారెడు అవుతుంది.
దీన్ని బట్టి జైలుకు వెళ్లినోళ్లకు రాజకీయంగా కలిసొస్తోంది. వ్యక్తిగతంగానూ తొందరగా ఎదిగే అవకాశం ఏర్పడుతోంది. ఊచలు లెక్కపెట్టిన వ్యక్తిని ప్రజలు సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. జైలుకు వెళ్లొచ్చాక భయం పోయి విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. బూతులు తిడుతూ అనుచరుల ద్వారా దాడులకు పాల్పడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు, క్యాడర్‌లో ధైర్యాన్ని నింపుతూ మెల్లిగా మచ్చిక చేసుకుంటున్నారు. మంచివాళ్లమంటూ నమ్మించి డబ్బులు పంచుతూ డైనమిక్ లీడర్లుగా తయారవుతున్నారు. పక్కా వ్యూహంతో అడుగులేస్తూ అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా 18వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల్లో చాలావరకు అలాంటివారే ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటికి్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. గెలిచిన మొత్తం 543 ఎంపీల్లో సగానికి పైగా..అంటే 251 మంది వివిధ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొన్నవారే. వారిలో 27 మందిపై నేరం రుజువైంది. శిక్ష కూడా అనుభవించారు. అత్యాచారం, హత్య, కిడ్నాప్, మహిళలపై లైంగిక వేధింపులు వంటి తీవ్ర నేరారోపణలు వాళ్లపై ఉన్నట్లు వెల్లడించింది. బీజేపీ నుంచి 94, కాంగ్రెస్‌లో 49, సమాజ్‌వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 13 డీఎంకే 13 గా ఉన్నారు. ఈ విషయంపై ప్రజాసంఘాలు ఉద్యామాలు చేస్తున్నా ఫలితాలు ఆశించిన మేర జరగడం లేదు. కోర్టులు కూడా నామమాత్రంగానే వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఫైనల్‌గా ఓటర్ డెసిషన్ ఈజ్ ఫైనల్.
PARTY | No. of Candidates involved in crimes |
BJP | 94 |
Congress | 49 |
Samajwadi party | 37 |
Trinamool Congress | 13 |
DMK | 13 |
ఇవి కూడా చదవండి :