Homeహైదరాబాద్latest Newsఐదోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా : సీఎం చంద్రబాబు

ఐదోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా : సీఎం చంద్రబాబు

చంద్రబాబు 4.0లో వెర్షన్-1 ఇప్పుడే మొదలైంది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని, తాను ఐదోసారి సీఎంగా వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 30 ఏళ్లుగా ఒకే పార్టీ పాలిస్తోందని తెలిపారు. డిసెంబర్ నుండి అమరావతి పనులు ప్రారంభిస్తాం.. 2027 నాటికీ పోలవరం పూర్తి చేస్తాం అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సాగేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img