T20 ప్రపంచ కప్ సూపర్ 8 యొక్క మొదటి మ్యాచ్‌లో భారతదేశం బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.మ్యాచ్‌లో భారత్‌దే పైచేయిగా ఉండనుంది. అదే సమయంలో గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో అఫ్ఘానిస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గ్రూప్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. అదే సమయంలో నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా ఓడిపోయింది. గ్రూప్-ఏలో భారత జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ తొలి 3 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత విజయం సాధించింది. అదే సమయంలో చివరి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఓటమి చవి చూడాల్సి వచ్చింది. కానీ, ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అఫ్ఘానిస్థాన్‌పై సూపర్ 8లో భారత్ విజయ పరంపరను కొనసాగిస్తుందా?
టీమిండియా,ఆఫ్ఘనిస్తాన్ T20Iలలో చారిత్రాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించింది, ఇరు జట్లు ఎనిమిది సార్లు పోటీ పడగా ఏడింటిని టీం ఇండియా గెలుచుకుంది, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఆఫ్ఘనిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, నజీబుల్లా జద్రాబాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, హక్విల్‌హక్ ఫార్.