కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురించి తెలియని వారు ఉండరు. అదే నండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల మీద పోటీ ఊహించని విజయం అందుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయనకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటంటే.. కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
కాటిపల్లి వెంకటరమణారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008 నుండి 2011 వరకు కాంగ్రెస్ పార్టీ తరుపున నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశాడు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరాడు. 2018 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఓటమి పాలయ్యాడు. అయితే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న ఏలేటి దీనికి సంబంధించి పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాటిపల్లి వెంకటరమణారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.