డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద 25 రోజుల్లో రూ.1760 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కలెక్షన్స్ రాబడుతుంది. సౌత్ ఇండియాలో ‘బాహుబలి 2’ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ”పుష్ప 2” రికార్డు సృష్టించింది. 2017లో వచ్చిన ‘బాహుబలి 2’ రూ.1810 కోట్లు వసూలు చేసింది. అయితే ”పుష్ప 2” సినిమా త్వరలోనే ఆ సినిమా రికార్డు ను బద్దలు కొడుతుంది అని తెలుస్తుంది.