సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్త వైరల్ అవుతోంది. సమంత-నాగ చైతన్య విడాకులు అందర్నీ షాక్ కి గురి చేశాయి. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయారు. విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా వీరిద్దరూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కొంత కాలం తర్వాత తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నానని సమంత స్వయంగా చెప్పింది. సమంత తన ఆరోగ్యం దృష్ట్యా ఏడాదిన్నర పాటు సినిమాలకు విరామం తీసుకుంది. మళ్లీ పెళ్లి చేసుకుంటావా అని చాలా మంది అడిగినప్పటికీ.. చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఒంటరిగా జీవిస్తానని కొన్ని సార్లు చెప్పింది.
తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘సిటాడెల్ హనీ బన్నీ’ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘సిటాడెల్ హనీ బన్నీ’ సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.