Homeస్పోర్ట్స్వరల్డ్​ కప్​పై మళ్లీ కాలు పెడతా!

వరల్డ్​ కప్​పై మళ్లీ కాలు పెడతా!

– ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఇటీవల వరల్డ్​ కప్​ మీద కాలు పెట్టడంతో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మిచెల్​ మార్ష్​ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరల్డ్​ కప్​ మీద కాలు పెట్టడాన్ని సమర్థించుకున్నారు. కప్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదన్న మార్ష్‌.. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. ఫైనల్లో భారత్‌పై విజయం అనంతరం ప్రపంచకప్‌ ట్రోఫీపై మార్ష్‌ కాళ్లు పెట్టిన ఫొటో దుమారం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ‘ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సామాజిక మాధ్యమాల్ని అధికంగా చూడను. అందులో నాకెలాంటి తప్పు కనబడట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడను’ అని మార్ష్‌ తెలిపాడు. మార్ష్​ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img