సెంచరీ కొట్టినా, వికెట్ తీసినా ఉలకని, పలకని వ్యక్తి బర్త్‌డే ఈ రోజు. అదే! కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ పుట్టిన రోజు. సరిగ్గా అతని బర్త్‌డే రోజే ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్‌లో అటు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతంగా ఆడి కప్ గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో నరైన్ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 13 మ్యాచుల్లో 482 రన్స్ చేశాడు. ఓ సెంచరీ కూడా ఉంది. 16 వికెట్లు కూడా తీశాడు.