దసరా సమయంలోనే కాదు…దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధ… ధాన్యం కొనుగోలుపై ఎందుకు లేదు? రైతులంటే ఎందుకంత చిన్నచూపు చూస్తున్నారు? మీ గారడీ వాగ్దానాలతో మోసపోతున్నందుకా? అని కేటీఆర్ అడిగారు. రాజకీయాల్లో రాక్షస ఆటలు ఆపి రైతులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు చెప్పారు. రైతుల విషయంలో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రోజుల తరబడి పడి ఉన్నా అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలుకు ఆదేశాలు రావడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.