ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు, ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛన్ అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించ జరిపి త్వరలో చేపడతామని పేర్కొంది. అలాగే శాఖల వారీగా శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు.