Homeహైదరాబాద్latest News'ఆదిత్య 369' మూవీకి సీక్వెల్‌ ఉండబోతుందా..? లేదా..? క్లారిటీ ఇచ్చిన బాలయ్య

‘ఆదిత్య 369’ మూవీకి సీక్వెల్‌ ఉండబోతుందా..? లేదా..? క్లారిటీ ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘ఆదిత్య 369’. ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో 1991లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా హిట్టుగా నిలించింది. ఈ సినిమాకి సీక్వెల్ కోసం సినీ ప్రియులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ ఉంటుంది అని బాలకృష్ణ ఇప్పటికే చాలా సార్లు చెప్పగా.. తాజాగా ఈ సీక్వెల్ వివరాలను ప్రకటించారు. బాలకృష్ణ హోస్టుగా ‘అన్‌స్టాపబుల్ ‘ సీజన్ 4 అనే షో చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ‘ఆదిత్య 369’ సినిమా గెటప్‌లో బాలకృష్ణ సందడి చేశారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా ఆదిత్య 999 రాబోతుంది అని తెలిపారు. నా కొడుకు మోక్షజ్ఞ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని ప్రకటించారు. త్వరలోనే ‘ఆదిత్యకి 999’ సినిమాకి సంబందించిన అప్డేట్ ఇస్తామని బాలకృష్ణ తెలిపారు. నందమూరి మోక్షజ్ఞ ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘ఆదిత్య 999’లో మోక్షజ్ఞ నటించనున్నాడు.

Recent

- Advertisment -spot_img