Homeహైదరాబాద్latest Newsనర్సంపేట అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే దొంతి

ఇదేనిజం, నర్సంపేట రూరల్: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి అన్నారు. మండలంలోని లక్నెపల్లి గ్రామంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి విజయవంతం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి జరిగే విధంగా క్షేత్ర, మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు రూ.5 లక్షలు ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు.

Recent

- Advertisment -spot_img