బీసీసీఐ సెక్రటరీ జై షా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఛైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే జై షా ఆస్తులు, సంపదపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. జై షా నికర ఆస్తుల విలువ రూ.124 కోట్లు. బీసీసీఐ కార్యదర్శిగా అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నందుకు షా రోజుకు రూ. 84,000తో పాటు బస, ప్రయాణ భత్యం పొందుతారు. అలాగే వ్యవసాయ వస్తువులు ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేసే ‘టెంపుల్ ఎంటర్ప్రైజ్’ కంపెనీలో డైరెక్టర్ గా ఉండటమే కాక కుసుమ్ ఫిన్సర్స్లో 60% వాటాను కలిగి ఉన్నారని సమాచారం. జై షా నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.