ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్‌లోని సంధ్య సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళా మరణించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తరువాత మధ్యంతర బెయిల్‌పై విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నట్లు దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏ సినిమా స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా పాపులర్ కావడమే వారి తప్పా? అలా ‘క్షణం క్షణం’ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన వేలాది మందిలో ముగ్గురు చనిపోయారు. మరి ఇప్పుడు తెలంగాణ పోలీసులు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా? అని ఆర్జీవీ ట్వీట్ చేసారు.