కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. ‘సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తారా? ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? అంటూ ట్వీట్టర్‌లో ఫైర్ అయ్యారు.