Homeహైదరాబాద్latest Newsపచ్చి బ్లాక్ ​మెయిలర్​కు ఓట్లేస్తారా?: కేటీఆర్

పచ్చి బ్లాక్ ​మెయిలర్​కు ఓట్లేస్తారా?: కేటీఆర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్​ తరఫున విద్యావంతుడు అభ్యర్థిగా ఉంటే.. మరోవైపు ఓ బ్లాక్ ​మెయిలర్ ప్రత్యర్థిగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నల్లగొండ– వరంగల్– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేస్తన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్​ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలనూ పరిశీలించండి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మేం గుడి పేరుతో ఓట్లు అడగలేదు. ప్రాజెక్టులు కట్టాం.. వాటికి దేవుళ్ల పేర్లు పెట్టాం. కేసీఆర్‌ పాలనలో ఉమ్మడి నల్లగొండలో మూడు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించాం. ప్రధాని మోడీ అన్ని వర్గాలను మోసం చేశారు.

విభజన హామీలను తుంగలో తొక్కారు. బీఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. వాటి జాయినింగ్ లెటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓటమికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. మేం చేసిన పనిచెప్పుకోలేదు. రెండోది కొన్ని వర్గాలను దూరం చేసుకున్నాం. ఇవాళ తెలంగాణ ఆగమైంది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి.. అన్నింటిని మర్చిపోయింది. రుణమాఫీపై రేవంత్ రెడ్డిది పూటకో మాట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్​ రెడ్డిది ప్రశ్నించే గొంతుక. ధిక్కార స్వరం. స్వయంకృషితో ఎదిగిన నేత. హైలీ ఎడ్యుకేటెడ్. ఓ వైపు బిట్స్‌ పిలానీలో చదువుకున్న అభ్యర్థిగా రాకేశ్​ రెడ్డి.. మరోవైపు బ్లాక్‌ మెయిలర్‌, సొల్లు కబుర్లు చెప్పే మోసగాడు, లాబీయింగ్‌ చేసే అభ్యర్థి ప్రత్యర్థిగా ఉన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయిపోయేదాకా బ్లాక్​మెయిలర్​ మీద యుద్ధం ప్రకటించండి. ఇదే మనం చేసే దేశ సేవ’ అని కేటీఆర్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img