Homeతెలంగాణఅంచ‌నాల‌ను మించిన‌ విప్రో

అంచ‌నాల‌ను మించిన‌ విప్రో

ఐటీ, సాఫ్ట్‌వేర్ సేవ‌ల దిగ్గ‌జం విప్రో మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచ‌నాల‌ను మించింది. గ‌త‌ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికంతో పోలిస్తే గ‌త ఆర్థిక సంవ‌త్స‌ర నిక‌ర లాభం 0.14 శాతం పెరిగింది.

గ‌తేడాది మూడో త్రైమాసికంలో 2,968 కోట్ల నిక‌ర లాభం గ‌డించింది విప్రో. నాలుగో త్రైమాసికంలో అది స్వ‌ల్పంగా పెరిగి రూ.2,972 కోట్ల‌కు చేరుకున్న‌ది.

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే నిక‌ర లాభాల్లో విప్రో 27.8 శాతం పురోగ‌తి సాధించింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో విప్రో నిక‌ర లాభం రూ.2,326 కోట్లు.

విప్రో ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.16,245 కోట్ల‌కు చేరుకున్న‌ది. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికం ఆదాయం రూ.15,711 కోట్లు. డిసెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 3.67 శాతం పెరిగింది.

డాల‌ర్ల రూపేణా విప్రో ఆదాయం 2.15 బిలియ‌న్ డాల‌ర్లు కాగా, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి త్రైమాసికంతో పోలిస్తే 3.9 శాతం, వార్షిక ప్రాతిప‌దిక‌న 3.8 శాతం ఎక్కువ‌. షేర్‌పై సంపాదన రూ.5.39గా ఉంది.

ఇది 2019-20తో పొలిస్తే 31.8 శాతం పెరిగింది.

విప్రో మేనేజింగ్ డైరెక్ట‌ర్ కం సీఈవో థైర్రీ డెలాపొర్టే మాట్లాడుతూ వ‌రుస‌గా మూడో త్రైమాసికంలో ఆదాయంలో మంచి పురోగ‌తి సాధించామ‌న్నారు. డీల్స్‌, ఆప‌రేటింగ్స్ పొంద‌డంలో ప్ర‌గ‌తి న‌మోదైంద‌న్నారు.

గ‌త మార్చితో ముగిసిన త్రైమాసికంలో క్యాప్కో సంస్థ‌ను టేకోవ‌ర్ చేయ‌డంతో త‌మ గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ సెక్టార్ బ‌లోపేతం అవుతుంద‌ని థైర్రీ డెలాపొర్టే చెప్పారు.

అన్ని కీల‌క మార్కెట్లు పెరుగుతున్నాయ‌ని, వ‌చ్చే ఏడాది వ్రుద్ధిరేటుకు ఇది పునాదిగా మారుతుంద‌న్నారు.

Recent

- Advertisment -spot_img