Homeరాజకీయాలుడీకే శివకుమార్​తో మాజీ మంత్రి శివకుమార్​ భేటీ

డీకే శివకుమార్​తో మాజీ మంత్రి శివకుమార్​ భేటీ

– పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు.. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ తో భేటీ అయ్యారు. దీంతో శ్రీరాములు పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక బీజేపీ స్టేట్​ చీఫ్​ పదవిని శ్రీరాములు ఆశించారు. కానీ బీజేపీ హైకమాండ్​ మాత్రం .. ఆ పదవిని యడియూరప్ప కుమారుడికి ఇచ్చింది. దీంతో శ్రీరాములు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు శ్రీరాములు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు

Recent

- Advertisment -spot_img