Homeహైదరాబాద్latest Newsఈ కలెక్టర్ అన్న ఒక్క మాటతో.. ఆ అధికారులకు చెమటలు పట్టాయి..!

ఈ కలెక్టర్ అన్న ఒక్క మాటతో.. ఆ అధికారులకు చెమటలు పట్టాయి..!

ఒక రైతు తన భూమి రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం అడుగుతున్నారని కలెక్టర్ కు పిర్యాదు చేయగా ఆ కలెక్టర్ అన్న ఒక్క మాటకు రెవెన్యూ సిబ్బందికి చెమటలు పట్టాయి. వివరాలలోకి వెళ్తే.. అశ్వాపురంలో భూభారతి అవగాహన సదస్సులో అశ్వాపురంలో భూభారతి రెవెన్యూ చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు కొత్త చట్టం గురించి వివరిస్తుండగా.. ఆనందపురం గ్రామానికి చెందిన ఒక రైతు తన బాధను కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నాడు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని స్థానిక రెవెన్యూ సిబ్బంది రికార్డుల్లో నమోదు చేయడం లేదని.. అలా చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

రైతు చెప్పిన మాటలు విన్న కలెక్టర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ‘వెంటనే సంబంధిత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయండి. ఒకవేళ మీరు ఫిర్యాదు చేయడానికి భయపడితే నాకు చెప్పండి, నేనే స్వయంగా ఏసీబీ అధికారులను పంపిస్తాను’ అని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. దీంతో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. వారి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. కలెక్టర్ మాటలతో అవగాహన సదస్సుకు హాజరైన రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

Recent

- Advertisment -spot_img