Homeహైదరాబాద్latest Newsబీపీ మండల్ స్పూర్తితో.. బీసీలకు 52 శాతం రిజర్వేషన్ లకై పోరాటం

బీపీ మండల్ స్పూర్తితో.. బీసీలకు 52 శాతం రిజర్వేషన్ లకై పోరాటం

  • దేశవ్యాప్తంగా కులగణన చేయాలి
  • బీసీ సంఘం నాయకుడు ఎనగందుల లక్ష్మన్

ఇదేనిజం, లక్షెట్టిపేట: బీసీల రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ స్పూర్తితో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు సాధించడానికి పోరాటం కొనసాగిస్తామని బీసీ సంఘం నాయకుడు ఎనగందుల లక్ష్మన్ పేర్కొన్నారు. ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మొత్తం జనాభాలో ‘మేమెంత మందిమో మాకంత వాటా’ దక్కే వరకు పోరాడుతామన్నారు. 60 శాతం ఉన్న జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీలకు 52 శాతం ఇవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. బీసీలు ఇప్పటికైనా 52 శాతం రిజర్వేషన్ల కొరకు పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అయిల్ల రాజన్న, గుండారపు బీమన్న, నల్లూరి కమలాకర్, సందరాజుల మహేష్, తాడూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img