Homeహైదరాబాద్latest News‘దేవర’ పార్ట్ 1 విజయంతో కొరటాల భారీ స్కెచ్.. పార్ట్ 2లో ఆ టాప్ స్టార్స్

‘దేవర’ పార్ట్ 1 విజయంతో కొరటాల భారీ స్కెచ్.. పార్ట్ 2లో ఆ టాప్ స్టార్స్

తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ‘దేవర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘దేవర’ పార్ట్ 1 విజయం తరువాత కొరటాల దేవర పార్ట్ 2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దేవర 2 మరింత పెద్దదిగా ఉండబోతోందని.. పైగా ఈ సినిమాల్లో టాప్ సెలబ్రిటీలు నటించే స్కోప్ ఉందని వెల్లడించారు. వీరిలో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు నటించే అవకాశం ఉంది. అప్పట్నుంచి దేవర పార్ట్ 2లో వీరిద్దరిలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ జనవరి 2025 నుండి ప్రశాంత్ నీల్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Recent

- Advertisment -spot_img