Homeహైదరాబాద్latest Newsబాన్సువాడ లో కలకలం రేపిన మహిళ, బాలుడి శవాలు

బాన్సువాడ లో కలకలం రేపిన మహిళ, బాలుడి శవాలు

-కొత్త భవనం లో గుర్తు తెలియని మృతదేహాలు

ఇదేనిజం, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని న్యూ వీక్లీ మార్కెట్ సమీపంలో కొత్తగా నిర్మాణం అవుతోన్న భవంతిలో ఓ మహిళ, ఓ బాలుడి మృతదేహాలు లభించాయి. ఈ సంఘటన బాన్సువాడ లో కలకలం రేపింది. కొత్త భవనం లో 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళా మృతదేహం, 6 నుంచి 8 సంవత్సరాలు కలిగిన బాలుడు మృతదేహాలను ఆదివారం ఉదయం 11 గంటలకు పోలీసులు గుర్తించారు. మృతదేహాలు కుళ్ళిపోయి ఉన్నాయని బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివారం(May 19) ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని కుళ్లిపోయిన రెండు మృతదేహాలను న్యూ వీక్లీ మార్కెట్ దగ్గరలోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలోని ఒక షెటర్లో ఒక మహిళ, ఒక బాలుడు చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు వచ్చి చూడగా మహిళ, బాలుడు మృతి చెంది మూడు నుంచి నాలుగు రోజులు అయినట్లు తెలిపారు. మృతి చెందిన వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఒంటిపై లేత గోధుమ రంగు టాప్, నలుపు రంగు పాయింటు దుస్తులు ధరించి, ఎత్తు ఐదు ఫీట్ల పొడవు కలిగి ఉన్నారని, బాలుడు ఆకుపచ్చ టీ షర్ట్, కాషాయం రంగు కలిగిన నిక్కర్ ఉందని తెలిపారు. మృతదేహాలను బాన్సువాడ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా మృతదేహాల వివరాలు తెలిసినవారు బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కాగా ఈ సంఘటన లో మహిళ, బాలుడు తల్లి, కొడుకా? ఆత్మహత్య చేసుకున్నారా? లేదా హత్య చేసి కొత్త భవనం లో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల విచారణ లో వీరి గుర్తింపు, మిగతా వివరాలు తెలుస్తాయి.

Recent

- Advertisment -spot_img