ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని బజరంగ్ యూత్, గొల్లపెల్లి పద్మశాలి సంఘ భవనంలో, రాఘవపట్నం గ్రామంలోని వారియర్స్, పాంతర్స్ యూత్, చిల్వకోడూర్ గ్రామంలోని గొట్కూర్ వాడలో శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు. అర్చకులు సమక్షంలో మహిళలు గణపతికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కుంకుమపూజ నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు.