Women’s T20 : 2025 మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. కౌలాలంపూర్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో టీమిండియా మహిళలలు ఓడించారు. వరుసగా రెండవ సారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను టీమిండియా గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. గొంగడి త్రిష 3 వికెట్లు, పరుణికా సిసోడియా 2 వికెట్లు, ఆయుషి శుక్లా 2 వికెట్లు, వైష్ణవి శర్మ 2 వికెట్లు, షబ్నమ్ షకీల్ 1 వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 11 ఓవర్లలో 84 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ప్రపంచ కప్ విజేతగా టీమిండియా నిలిచింది.