Homeజిల్లా వార్తలుగొల్లపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం

గొల్లపల్లిలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామంలో మండలస్థాయిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అంతరాలను తొలగించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించడం ఏడు నెలల నుండి తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ వరకు ముర్రుపాల ప్రాముఖ్యత గంటలోపు తల్లిపాలు పట్టించవలెనని తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, తల్లిపాలు దేవుడిచ్చిన వరమని, తల్లిపాలు అమృతంతో సమానం. మొదట వచ్చే పాలు లేత పసుపు రంగులు చిక్కగా ఉంటాయని ఒక టీకా లాగా పని చేస్తుందని గర్భిణీ స్త్రీలకు వారి కుటుంబ సభ్యులకు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు మరియు ఆరు నెలలు దాటిన పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమాలు మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించి దాని యొక్క ప్రాముఖ్యతను తల్లులకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, వైద్య అధికారి నరేష్, అంగన్వాడి సూపర్వైజర్స్ మమత, జ్యోతి,ఏఎన్ఎం రజిత, అంగన్వాడి టీచర్స్ ఉమారాణి, సరోజన, అనంతలక్ష్మి, హరిప్రియ, విజయ, జమున, ఇబ్రహీం నగర్ రమాదేవి, ప్రణీత,శ్యామలత, రాధ,గర్భవతులు, బాలింతలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img