వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ప్రారంభ సీజన్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో నిన్న అర్థరాత్రి జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్‌లను ఓడించింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ మైదానంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (36 బంతుల్లో 41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయం సాధించింది. అంబటి రాయుడు (30 బంతుల్లో 50, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 4, 3 సిక్సర్లతో) మెరిశాడు. గురుకృత్ సింగ్ (33 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్.. కీలకమైన ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. షోయబ్ మాలిక్ అద్భుత ఇన్నింగ్స్‌తోపోరాడే లక్ష్యాన్ని అందుకున్నా కానీ విజయం సాధించలేకపోయింది.