భారత్ ను ప్రపంచం ఫెయిల్ చేశాయని అమెరికా ముఖ్య సలహాదారు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ కు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత గండం నుంచి భారత్ ను బయటపడేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
గార్డియన్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో అన్ని దేశాలకు వైద్య సాయం అందించడంలో ధనిక దేశాలు అసమానతలను ప్రదర్శించాయని మండిపడ్డారు.
ఆ అసమానతలకు భారత్ లోని పరిస్థితులే నిదర్శనమని చెప్పారు.
ఇప్పటికైనా ధనిక దేశాలు స్పందించి ప్రపంచ దేశాలకు అవసరమైన సాయం చేయాలని ఆయన సూచించారు. అన్ని దేశాలకు సమాన వసతులు కల్పించాలన్నారు.
భారత్ లో ఆక్సిజన్ చాలక చాలా మంది చనిపోతున్నారని, అక్కడ భయంకర పరిస్థితులున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఆసుపత్రుల్లో బెడ్లు కూడా చాలినన్ని లేవని అన్నారు. ఆ గండం నుంచి భారత్ ను గట్టెక్కించేలా ధనిక దేశాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ఒక దేశంతో మరో దేశానికి ఇప్పుడు ప్రపంచమంతా ముడిపడి ఉందని, ధనిక దేశాలు తమ దగ్గర ఉన్నవి లేని దేశాలకు ఇచ్చి ఉదారత చాటుకోవాలని సూచించారు.