ఇదేనిజం, జగదేవపూర్ :సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా శనివారం తిగుల్ గ్రామ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు ఆధ్వర్యంలో జగదేవపూర్ మండలంలో తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోనియాగాంధీ పేరు మీద అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ పుణ్యఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రములోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు అన్నిరకాల సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. సోనియాగాంధి ఆయురారోగ్యలతో బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ రెడ్డి, రాజు, చంద్రం, భాను, బబ్లూ, వెంకట్ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.