వివాహం తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. చిన్నచిన్న విషయాలకే కోపంతో ఊగిపోతుంటారు కొందరు. చిరాకు, అసహనం, ఆవేశం, పేషెన్సీ కోల్పోవడం వంటివి మీ సమస్యను ఇంకా పెంచేవే తప్ప తగ్గించలేవు. ఎంత కూల్ అండ్ కామ్‌గా మీరు పరిస్థితులకు రెస్పాండ్ అవుతారో అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా మీ భార్య/ భర్త పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఉంటే బెటర్. ఒకవేళ ఇదివరకే మీ మధ్య కొన్ని అపోహలు, డీవియేషన్స్, అనుమానాలు వంటివి ఉన్నట్లయితే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించుకోవడమే మేలు. ఎందుకంటే అవి చిలికి చిలికి గాలివానలా ఎప్పుడైనా ప్రమాదకరంతా మారొచ్చు. రోజూ ఇద్దరూ కూడా ఆనందంగా జీవించాలంటే ఒఖరినొకరు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బిల్డ్ చేసుకోవాలి. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఆ పనులు నచ్చకపోతే నిర్మొహమాటంగా అడగాలి. అర్థమయ్యేలా చెప్పాలి. రిక్వెస్ట్ చేయాలి. బతిమాలాలి. మీ భార్యే/ భర్తే కదా. తప్పేముంది.
రోజూ ఓ కిస్, హగ్ మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. 6 సెకన్ల పాటు కిస్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. లిప్ టు లిప్ కిస్ అయి ఉండాలంటున్నారు. ఇలా కిస్ చేసేటప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌లు రిలీజ్ అవుతాయట. మీ భాగస్వామి పట్ల మీ ప్రేమ అర్థమవుతుందట. అందుకే పరుషులు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఓ 6 సెకన్లపాటు తమ భార్యను కిస్ చేస్తే ఎటువంటి తలనొప్పి ఉండదు. తను హ్యాపీ, మీరూ హ్యాపీ.