ఆర్జే శేఖర్ బాషా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య పోలీసుల్ని ఆశ్రయించారు. ‘శేఖర్ బాషా నాపై దాడి చేశాడు. కడుపులో, నడుము మీద తన్నాడు. 12 మెట్లపై నుంచి కిందకు పడిపోయాను. నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. మొన్న రాత్రి మా ఇంటి కిటికీపై రాళ్లు విసిరారు. అతడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. భయమేస్తోంది. నాకేం జరిగినా అతడే కారణం’ అని అన్నారు.