మోసగాళ్లు కొత్త మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారంతో సైబర్ నేరగాళ్లు పిల్లలను పావులుగా చేసుకుంటున్నారు. పిల్లలు కేసుల్లో ఇరుక్కుంటారని, భవిష్యత్‌ను నాశనమవుతుందంటూ కలవరపాటుకు గురయ్యేలా చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. సీబీఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ విభాగాల అధికారులుగా టోకరా వేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల వెలుగు చూడడం గమనార్హం.