‘ఎక్స్’ ఒలింపిక్ పతక విజేతలకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. కాంస్య పతక విజేత భారత షూటర్ మను బాకర్ ఖాతా పక్కన ఈఫిల్ టవర్ లోగో కనిపించింది. పారిస్ పతక విజేతలందరికీ ఈ తరహా గుర్తింపు లభించడం విశేషం. అయితే పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో నిన్న భారత్‌కు తొలి పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే.