ఇదేనిజం,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గం మియాపూర్ డివిజన్ 108 కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా యువకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శనివారం కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా ఉదయ్ కిరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ తరపున ప్రజలకు మేలుకలిగే ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీకి మంచి పేరు తీసుకు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.