Homeఆంద్రప్రదేశ్​జ‌గ‌న్ మూలంగా ఏపీకి రూ.5 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం

జ‌గ‌న్ మూలంగా ఏపీకి రూ.5 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం

  • జ‌గ‌న్ మూలంగా ఏపీకి రూ.5 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం
  • గ‌డిచిన‌ రెండేళ్లలో ఎగుమతుల్లో పురోగతి శూన్యం
  • కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయాయి
  • వైసిపి ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు ధ్వజం


అమ‌రావ‌తిః నీతి అయోగ్ బుధవారం విడుదల చేసిన ఎగుమతుల సన్నద్దత సూచి 2020లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం దారుణమ‌ని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో ఇంకా ఏమ‌న్నారంటే.. పోర్టులు లేని తెలంగాణ 6వ స్థానం, 12పోర్టులు ఉన్న ఏపి 20వ స్థానంలో నిల‌వ‌డం ముఖ్యమంత్రి జగన్ ప‌రిపాల‌న సామ‌ర్థ్యానికి అద్దం ప‌డుతోంద‌న్నారు. జగన్ పాలన తొలి రెండేళ్లు పరిశ్రమల అభివృద్ది లేదు, ఉపాధి కల్పన క‌ల్పించ‌క‌పోగా ఉన్న ఉద్యోగాల‌ను పోయేలా చేశార‌న్నారు. ఇండ‌స్ట్రియ‌ల్ పాలసీ పరంగా ఏపి పనితీరు నాసిరకమని నీతి అయోగ్ మొట్టికాయ వేసిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరులో మార్పు రాలేద‌ని ఆక్షేపించారు.
జ‌గ‌న్‌కు జ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలీదు
టీడీపీ హ‌యంలో వ‌చ్చిన ప‌రిశ్రమలను పోగొట్టారని, వచ్చిన పెట్టుబడులను తరిమేశారని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జగన్‌కు అర్థంకాని అంశంగా మారిందని ఎద్ద‌వ చేశారు. కరోనాతో రాబోయే 3ఏళ్లు ఇదే పరిస్థితి ఉండవచ్చ‌ని లేదా ఇంకా దిగజారే ప్ర‌మాదం కూడా ఉంద‌న్నారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ తీరు కార‌ణంగా ఏపీ గ‌డిచిన రెండేళ్ల కాలంలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి రూ.5లక్షల కోట్ల మేర‌కు నష్టం జ‌రిగింద‌ని ఆరోపించారు. ఎగుమతుల ప్రోత్సాహం, వ్యవస్థాగత నిర్మాణం, మార్కెట్ పెనట్రేషన్‌లో ఏపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యింద‌న్నారు.
జ‌గ‌న్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త
వైసిపి వైఫల్యాలతో 2024దాకా పారిశ్రామిక వృద్ది రేటు సున్న‌కు ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. చంద్ర‌బాబు హ‌యంలో తొలి 3స్థానాల్లో ఉండే రాష్ట్రాన్ని అట్టడుగు 3స్థానాల్లోకి నెట్టిన ఘనత జగన్‌కే ద‌క్కుతుంద‌న్నారు. నీతి అయోగ్ రిపోర్ట్ లోనే కాదు, కరోనా నియంత్రణలోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త బ‌య‌ట ప‌డింద‌న్నారు. 8 తీర ప్రాంత రాష్ట్రాలలో 7వ స్థానంలో ఉండటాన్ని బట్టే వైసిపి ప్రభుత్వ వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచ‌నా వేయొచ్చ‌న్నారు. పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే, 11 మైనర్ పోర్టులు, 1మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఏపి 23వ స్థానంలో ఉండటం బాధాకరం అన్నారు. కేవ‌లం రాజ‌కీయ కక్షతో టిడిపి తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీని రద్దు చేయడం జగన్ ఘోర తప్పిదమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
వేలాది ఉద్యోగాలను కొల్పోయాం
అధికారంలోకి వచ్చిన 15నెలల తర్వాత వైసిపి ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ కాదు, డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ అప్రోచ్ పాలసీ అన్నారు. దీని కార‌ణంగానే అనేకమంది పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి దూరం అయ్యారన్నారు. కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వెనక్కి పోవడంతో, రూ. 2,500కోట్ల పెట్టుబడులను, వేలాది ఉద్యోగాలను కోల్పోయామ‌ని గుర్తు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించిన 130సంస్థలను పోగొట్టడంతో 60వేల ఉద్యోగాలను కోల్పోయిన‌ట్లు చెప్పారు. పరిశ్రమల్లో ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది యువతీ యువకులను దారుణంగా మోసం చేశారన్నారు.
భావి తరాలకు నష్టం
కోవిడ్‌కు ముందే వైసిపి 9నెలల పాలనలోనే రాష్ట్ర ఆర్ధికాభివృద్ది రేటు 3% నుంచి 4% నష్ట పోయిందన్నారు. టీడీపీ హ‌యంలో ఏడాదికి రూ. 2లక్షల కోట్ల రాబ‌డి చొప్పున‌ 5ఏళ్లలో రూ. 10లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాబబ్టిన‌ట్లు గుర్తుచేశారు. టిడిపి ప్రభుత్వమే వచ్చిఉంటే, గ‌డిచిన‌ 15నెలల్లో మరో రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు రాష్ట్రం మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు. భావి తరాలు నష్టపోయే దుస్థితి దాపురించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img