యాసంగి విత్తన సేకరణ, లభ్యతపై మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, ఎండీ కేశవులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి విత్తన సేకరణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు నిండాయి చెరువులు అలుగు పారుతున్నాయన్నారు. రైతాంగానికి సాగునీరు అందుబాటులో ఉందన్నారు మంత్రి. గత యాసంగికన్నా ఈ ఏడాది సాగు పెద్ద ఎత్తున పెరుగుతుందని, వేరుశనగ, పప్పుశనగ, వరి విత్తనాల సేకరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. విత్తన సరఫరాలో సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, సెప్టెంబరు నెలలో యాసంగి విత్తనాలు సిద్దంగా ఉంచాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం 50 వేల క్వింటాళ్ల వేరుశనగ, 73 వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద సిద్దంగా ఉందన్నారు.