YCP Party : ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ పార్టీ (YCP Party) కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇకపై ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ వెల్లడించారు. వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షహోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అని జగన్ తెలిపారు.