Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో వైసిపి సర్పంచ్ బాలరాజు మృతి

రోడ్డు ప్రమాదంలో వైసిపి సర్పంచ్ బాలరాజు మృతి

ఇదే నిజం, కుక్కునూరు: కుక్కునూరు ఆదివారం రాత్రి 7 గం”అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం లో కుకునూరు మండలం వింజ రం పంచాయితీ సర్పంచ్ జంగిడి బాలరాజు (35 సం”) మృతి చెందాడు . ఆదివారం సాయంత్రం అశ్వరావుపేట నుంచి కుక్కునూరు బైకుపై వస్తున్న క్రమంలో మండల సరిహద్దు గ్రామమైన కుడుముల పాడు వద్ద రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. వైసిపి యువ నాయకుడు మంచి పేరున్న బాలరాజు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img