Homeహైదరాబాద్latest Newsఅవును 'నేను ఆ తప్పు చేసాను'.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

అవును ‘నేను ఆ తప్పు చేసాను’.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ లో తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే 2017లో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఏడాది పాటు సినిమాలకు సమంత దూరంగా ఉంది. తాజాగా ‘సిటాడెల్ : హనీ బన్నీ’ సిరీస్ తో ప్రేక్షకులను ముందుకు రాబోతుంది.ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా..తనకి తగిలిన ఎదురుదెబ్బ గురించి సమంత తెలిపింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నేను గతంలో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే. గతంలో కొన్ని విషయాలు నాకు నచ్చినట్టు జరగలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాను’ అన్ని ఆమె చెప్పింది.
సమంత మాట్లాడ్తూ… ‘నేను నటించే ప్రతి పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుంటా.. నేను ఇంతకు ముందు చేసిన దానికంటే ప్రతి పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే.. గతంలో సినిమాల్లో కొన్ని తప్పులు చేశాను. అయితే.. గతంలో నేను చేసిన సినిమాల్లో కొన్ని తప్పులు చేసాను. నిజంగా కొన్ని సినిమాల్లో కష్టపడి పని చేయలేదని భావిస్తున్నా. నేను నా వైఫల్యాన్ని అంగీకరిస్తున్నాను.గతంలో కొన్ని సినిమాల్లో నా అత్యుత్తమ నటన ప్రదర్శన చేయలేకపోవచ్చని అంగీకరిస్తున్నాను’’ అంటూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Recent

- Advertisment -spot_img