ఇదేనిజం,శేరిలింగంపల్లి: మియాపూర్ లోని ముజఫర్ అహ్మద్ నగర్ లో ఈ నెల 23, 24 తేదీలలో జరుగనున్న యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశానికి హాజరయిన ఆయన మాట్లాడుతూ…దేశంలో బిజెపి ,రాష్ట్రంలో గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను అనేక సమస్యల సుడిగుండంలో నెట్టివేయడం జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేని ప్రభుత్వాలు పెట్టుబడి దారి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నయన్నారు.
ఈ సమావేశాలను ప్రజలు,ప్రజాతంత్ర వాదులు, సామజిక శక్తులు జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చినారు.యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇ.దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మైదంశెట్టి రమేష్, తుడుం అనిల్ కుమార్,కమిటీ సభ్యులు కుంభం సుకన్య,పి.భాగ్యమ్మ, ఎ పుష్ప, తాండ్ర కళావతి,వి.తుకారాం నాయక్,కర్ర దానయ్య,పల్లే మురళి,ఇ.దశరథ్ నాయక్ పాల్గొన్నారు.