Homeహైదరాబాద్latest NewsPiles : ఈ చిట్కాతో పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు

Piles : ఈ చిట్కాతో పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు

అనారోగ్య సమస్యలు ప్రస్తుతం పెద్దవారికే కాక చిన్నపిల్లలకూ వస్తున్నాయి. షుగర్, బీపీ, పైల్స్ ఇలా అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగటం, మలబద్దకం సమస్య, ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు.

పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.

ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది.

వాము ను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాముపొడి వేసి బాగా కలపాలి. ఈ మజ్జిగను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండాలి. ఫైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి.

మసాలాలు, కారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.

నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి.

Recent

- Advertisment -spot_img