Homeహైదరాబాద్latest Newsఓట్ల కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని మరచిపోయావు.. ఖర్గేపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

ఓట్ల కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని మరచిపోయావు.. ఖర్గేపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓట్ల కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మరచిపోయారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అన్నారు. బ్రిటిష్ హయాంలో హైదరాబాద్ నిజాం పాలన జరుగుతున్నప్పుడు ఖర్గే కుటుంబం నివసించిన గ్రామం కూడా నిజాం ఆధీనంలో ఉండేది. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో అతని ఇల్లు దగ్ధమైంది. ఖర్గే తల్లితో సహా కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు కోల్పోయారు అని యోగి అన్నారు.మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆదిత్యనాథ్ తన “బాటేంగే తో కటేంగే (విభజిస్తే నశించిపోతాం)” అనే నినాదంపై ఖర్గే చేసిన విమర్శలపై స్పందించారు. “నేను యోగిని, నాకు దేశం ముందుంటుంది, అయితే మల్లికార్జున్ ఖర్గేకి బుజ్జగింపు రాజకీయాలు ముందుంటాయి” అని యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటనపై ఖర్గే మాట్లాడడు. ఎందుకంటే ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్‌కి ఒక వర్గం ఓట్లు పోతాయి. అందుకే దాని గురించి మాట్లాడడు. ఓట్ల కోసం తమ కుటుంబం చేసిన త్యాగాలను మరిచిపోయారు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు.

Recent

- Advertisment -spot_img