Homeహైదరాబాద్latest Newsనా మీద ప్రేమ కంటే.. మీకు కంప్లైంట్స్ ఎక్కువ..! 'పుష్ప 2' నిర్మాతలపై దేవిశ్రీప్రసాద్ హాట్...

నా మీద ప్రేమ కంటే.. మీకు కంప్లైంట్స్ ఎక్కువ..! ‘పుష్ప 2’ నిర్మాతలపై దేవిశ్రీప్రసాద్ హాట్ కామెంట్స్

మీరేమో నేను టైం కి పాట ఇవ్వలేదు. టైం కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. టైం కి ప్రోగ్రాం రాలేదు. నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది సార్.. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే.. మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు సార్ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రావడానికి దాదాపు 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. సార్ కెమెరాలో ఎంట్రీ ఇవ్వాలి కాసేపు ఆగండి అని నన్ను అక్కడ ఆపారు. నాకు అసలే సిగ్గు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సిగ్గు లేకుండా ఉంటాను, స్టేజ్ కింద ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ సిగ్గుపడేది నేనే నేను. లేదు రా బాబు నేను లోపలికి వెళ్తాను అంటే నన్ను లోపలికి పంపించలేదు. చివరికి కిస్సిక్ పాట విని లోపలికి పరిగెత్తుకొచ్చాను. నేను ఏమి చేయను సార్..? వేరేగా కలిసి అడిగినప్పుడు ఇంత కిక్ ఉండదు సార్.. ఇలా అడిగేసేయాలి నేను ఎప్పుడూ అంతే ఓపెన్ గానే మాట్లాడతాను అని దేవిశ్రీప్రసాద్ నిర్మాతలుపై హాట్ కామెంట్స్ చేసాడు.

Recent

- Advertisment -spot_img