హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో ఓ యువతి రెచ్చిపోయింది. ఇద్దరి కండక్టర్లపై యువతి దాడికి పాల్పడింది. కండక్టర్ చేంజ్ లేదు అన్నందుకు.. నోటికి వచ్చినట్లు నానా బూతులు తిట్టింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. బస్సు సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆ యువతి పై బస్సు కండక్టర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.