HomeEnglishYoung Tiger NTR at Oscar Actors Branch Oscar​ యాక్టర్స్​ బ్రాంచ్​లో Young Tiger...

Young Tiger NTR at Oscar Actors Branch Oscar​ యాక్టర్స్​ బ్రాంచ్​లో Young Tiger NTR

‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్​ టైగర్ ఎన్టీఆర్‌. ఇప్పుడీ స్టార్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు తారక్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ పేర్కొంది.

ఇక తారక్‌తో పాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. ఈ పోస్ట్‌ను ఎన్టీఆర్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ రెండు భాగాలుగా అలరించనుంది. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. దీనితో పాటు హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌2’లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img