సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఒకరి సినిమాలు థియేటర్ కి వచ్చినప్పుడు మరొక హీరో సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇదే క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దసరా కావడంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తెలుగులో యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ తప్పదని ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిజానికి రజనీకాంత్, ఎన్టీఆర్ ఒక్కసారి కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేదు. మరి ఈసారి వీరిద్దరూ భారీ రేంజ్ లో తలపడబోతున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పోటీ లో ఎవరు విజయం సాధిస్తారు చూడాలి..?