ఇదే నిజం, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఫిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుమ్మడిదల మండలం అన్నారం గ్రామం ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీలో 2019 నుంచి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు తో నివాసం ఉంటున్నాడు. కాగా చిన్న కూతురు కుషి కుమారి (21) ఈనెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.