Homeహైదరాబాద్latest Newsమీ అభిమానం సల్లగుండా..! 'పుష్ప రాజ్'ని కలవడానికి.. యూపీ నుండి 1600 కి.మీ సైకిల్ తొక్కిన...

మీ అభిమానం సల్లగుండా..! ‘పుష్ప రాజ్’ని కలవడానికి.. యూపీ నుండి 1600 కి.మీ సైకిల్ తొక్కిన అభిమాని

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని కలిసేందుకు ఓ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ అభిమానిని కలిశారు. సైకిల్‌పై 1600 కిలోమీటర్లు ప్రయాణించాడు అని తెలిసి అల్లు అర్జున్‌ షాక్ అయ్యాడు. అల్లు అర్జున్‌ని చూసి ఆ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే అల్లు అర్జున్ తన అభిమానిని సైకిల్ మీద వెళ్ళవద్దని తాను ఫ్లైట్ ఏదైనా బుక్ చేయిస్తానని తన స్టాఫ్ కి ఆ విషయాన్ని తెలిపాడు. ఇది అంత చూసి ‘మీ అభిమానం సల్లగుండా’.. అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img