Homeహైదరాబాద్latest Newsయువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి: డాక్టర్ చిగురు ఆది మలన్ బాబా వెంకన్న

యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి: డాక్టర్ చిగురు ఆది మలన్ బాబా వెంకన్న

ఇదే నిజం: ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో యువతకు క్రీడా స్ఫూర్తిని నింపడానికి, వారిలోని క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి కొండాపూర్ రాంరెడ్డిపల్లె గ్రామాల మధ్య క్రికెట్ పోటీ (టోర్నమెంట్) డా. చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ వారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ దాత అయిన డా.చిగురు ఆది మలన్ బాబా ముదిరాజ్ మాట్లాడుతూ, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచాలనే ఆలోచనతో, అందుకే టోర్నమెంట్ ను ఏర్పాటు చేశామని. తెలిపారు.యువతరం క్రీడల్లో ఇంకా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం జూన్ 02 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాం అని అన్నారు .ఈ టోర్నమెంట్ కు అయ్యే ఖర్చులను ఈ క్రికెట్ పోటీలో గెలుపొందిన గౌరీ వినీత్ జట్టుకు మొదటి బహుమతిగా నగదు రూ. 3500/- లతో పాటు ట్రోపిని యారటి కరుణాకర్ జట్టుకు రెండో బహుమతిగా నగదు రూ. 2000/- లతో పాటు ట్రోపీనీ, బెస్ట్ బౌలర్ గా చిగురు పర్శరాములు కి, బెస్ట్ బ్యాట్స్ మన్ గా ఎక్కలదేవి మహేష్ కి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భాస్కర్ కి శిల్డులను యువతకి క్రికెట్ కిట్లను డా.చిగురు ఆదిమలన్ బాబా ముదిరాజ్ దాతగా సమకూర్చారు. ఈ సందర్భంగా గంత రాజు మాట్లాడుతూ డా.చిగురు ఆది మలన్ బాబా వారి సోదరుడు చిగురు వెంకన్న ముదిరాజ్ యువతను క్రీడా రంగం లో ప్రోత్సహించడం చాలా ఉన్నతమైన విషయం అని కొనియాడారు. యువత కూడా వారు అందించే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఇలాగే ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తాం అని చెప్పిన చిగురు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరేపు రాజనర్సయ్య,మాజీ ఎంపీటీసీ రాజు, అనిల్ కుమార్,బాధ నరేష్, గౌరీ సురేష్, గంత రాజు, ఊరేటి రాజు,నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, గంధం మల్లయ్య, నవాబ్,కంటే సాయికుమార్, గ్రామ ప్రజలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img