– బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కేటాయించింది. జవాన్ మూవీ విడుదలైన అనంతరం షారూఖ్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తరుచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. షారుక్‌ను చంపేస్తామంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన భద్రత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి తర్వాత షారుక్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపేస్తామంటూ ముంబయిలోని ఆయన నివాసం మన్నత్‌కు పలు లేఖలు వచ్చాయి. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు.